Telugu Gateway
Cinema

'రొమాంటిక్' ట్రైల‌ర్ విడుద‌ల చేసిన ప్ర‌భాస్

రొమాంటిక్ ట్రైల‌ర్ విడుద‌ల చేసిన ప్ర‌భాస్
X

ఆకాష్ పూరీ, కేతికా శ‌ర్మ జంట‌గా న‌టించిన సినిమా 'రొమాంటిక్' . ఈ మూవీ అక్టోబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా ట్రైల‌ర్ ను ప్ర‌ముఖ హీరో ప్ర‌భాస్ మంగ‌ళ‌వారం నాడు విడుద‌ల చేశారు. అనిల్ పాడూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాను పూరీ జ‌గ‌న్నాధ్, ఛార్మి కౌర్ లు సంయుక్తంగా నిర్మించారు. ట్రైల‌ర్ ను విడుద‌ల చేసిన అనంత‌రం చిత్ర యూనిట్ కు ప్ర‌భాష్ శుభాకాంక్షలు తెలిపారు.

ట్రైల‌ర్ హాట్ హాట్ సన్నివేశాల‌తో నిండిపోయింది. యూత్ ను టార్గెట్ చేసి ఈ సినిమాను తెర‌కెక్కించిన‌ట్లు క‌న్పిస్తోంది. ఈ సినిమాలో ర‌మ్య‌క్రిష్ణ కీల‌క పాత్ర‌లో న‌టించారు. పూరీ జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ ఏక్ నిరంజ‌న్, బుజ్జిగాడు సినిమాల్లో చేసిన విష‌యం తెలిసిందే. రొమాంటిక్ సినిమాపై ఆకాష్ పూరి కూడా భారీ ఆశ‌లే పెట్టుకున్నాడు.

Next Story
Share it