అక్టోబర్ 29న 'రొమాంటిక్'
BY Admin18 Oct 2021 5:31 PM IST
X
Admin18 Oct 2021 5:31 PM IST
అకాష్ పూరి, కేతికా శర్మ జంటగా నటించిన సినిమానే రొమాంటిక్. ఈ సినిమాను అక్టోబర్ 29న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అనిల్ పాడూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను పూరీ జగన్నాధ్, ఛార్మికౌర్ సంయుక్తంగా తెరకెక్కించారు. మందిరా బేడీ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. పూరీ జగన్నాధ్ తనయుడు అయిన అకాష్ పూరి సరైన హిట్ కోసం గత కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఆంధ్రాపోరి, మెహబూబా వంటి సినిమాలు చేసినా బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. ఇప్పుడు మరోసారి రొమాంటిక్ సినిమా ద్వారా తన లక్ పరీక్షించుకోనున్నాడు.
Next Story