Telugu Gateway
Cinema

'రొమాంటిక్' మూవీ న‌వంబ‌ర్ 4న

రొమాంటిక్ మూవీ న‌వంబ‌ర్ 4న
X

ఆకాష్ పూరీ, కేతికా శ‌ర్మ న‌టించిన సినిమా 'రొమాంటిక్'. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్. న‌వంబ‌ర్ 4న ఇది ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ సినిమాలో ర‌మ్య‌క్రిష్ణ కీల‌క పాత్ర పోషించారు. పూరీ క‌నెక్ట్స్ బ్యాన‌ర్ పై ఈ సినిమాను పూరీ జ‌గ‌న్నాధ్, చార్మి కౌర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు క‌థ‌, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా పూరీ జ‌గ‌న్నాధ్ అందించ‌టం విశేషం.

అనిల్ పాడూరి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది. ఈ సినిమాపై ఆకాష్ పూరీ చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. గ‌తంలో ఈ కుర్ర హీరో చేసిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి. అందుకే ఇది అయినా హిట్ అయితే కెరీర్ గాడిన ప‌డుతుంద‌నే ఆశ‌తో ఉన్నాడు. వాస్త‌వానికి ఈ సినిమా కూడా ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉన్నా అన్నింటిలాగే ఇది కూడా క‌రోనా కార‌ణంగా ఆగింది.

Next Story
Share it