Telugu Gateway
Cinema

అద‌ర‌గొడుతున్న ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియో

అద‌ర‌గొడుతున్న ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియో
X

డేట్ ఫిక్స్ అయింది. ముందు చెప్పిన‌ట్లుగానే అక్టోబ‌ర్ 13న ప్ర‌తిష్టాత్మ‌క ఆర్ఆర్ఆర్ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర యూనిట్ ప్ర‌క‌టించిన‌ట్లుగానే గురువారం ఉద‌యం పద‌కొండు గంట‌ల‌కు ఆర్ఆర్ఆర్ సినిమా మేకింగ్ వీడియోను విడుద‌ల చేసింది. సినిమాలో యాక్షన్స్ సీక్వెన్స్ లు ఎంత అద్భుతంగా ఉండ‌బోతున్నాయో..సినిమా ఎంత రిచ్ నెస్ ఎలా ఉండ‌బోతుందో ఇందులో చూపించారు. స‌హ‌జంగా రాజ‌మౌళి సినిమా అంటే ఉండే భారీ భారీ సెట్టింగ్ లు..హంగామా ఇందులోనూ ద‌ర్శ‌నం ఇవ్వ‌బోతున్నాయి. గాలిలో తీగ‌ల‌పై వేలాడుతూ కెమెరా ప‌ట్టుకుని షూటింగ్ చేస్తున్న స‌న్నివేశాలు ఒళ్లు గ‌గుర్పొడిలే ఉన్నాయి.

దేశంలోనే అతిపెద్ద యాక్షన్ మూవీగా చిత్ర యూనిట్ దీన్ని పేర్కొంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమ‌రం భీమ్ గా న‌టిస్తుంటే..రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర పోషిస్తున్న విష‌యం తెలిసిందే. భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా అలియా భ‌ట్ న‌టిస్తుంటే..ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ భామ ఒలీవియో న‌టిస్తోంది. తాజాగా విడుద‌ల చేసిన మేకింగ్ వీడియో చూస్తే ఆర్ఆర్ఆర్ ఎంత గ్రాండ్ గా ఉండ‌బోతుందో అర్ధం అవుతుంది. ఈసినిమాలో అజ‌య్ దేవగ‌న్, శ్రియ, స‌ముద్ర‌ఖ‌ని త‌దిత‌రులు న‌టిస్తున్నారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై దాన‌య్య నిర్మాత‌గా ఉన్నారు.

Next Story
Share it