Telugu Gateway
Cinema

గ‌ర్జ‌న‌కు రెడీ అంటున్న ఆర్ఆర్ఆర్

గ‌ర్జ‌న‌కు రెడీ అంటున్న ఆర్ఆర్ఆర్
X

ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఇటీవ‌లే ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ల‌తో కూడిన ఫోటోతో కొత్త అప్ డేట్ ఇచ్చింది. రెండు పాట‌లు మిన‌హా సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌యింద‌ని..త్వ‌ర‌లోనే సంద‌డి అన్న సంకేతాలు ఇచ్చింది. ఇద్ద‌రు హీరోల‌తో కూడిన ఈ ఫోటో పిచ్చ వైర‌ల్ గా మారింది. ఇప్పుడు తాజాగా ఆర్ఆర్ఆర్ మ‌రో అప్ డేట్ తో వ‌చ్చింది. జులై 15న ఈ సినిమా మేకింగ్ వీడియో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.

ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబర్‌ 13న 'ఆర్‌ఆర్‌ఆర్‌'ను విడుదల చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. అయితే ఇది క‌రోనా మూడ‌వ ద‌శ త‌దిత‌ర అంశాల మీద ఆధార‌ప‌డి ఉండే అవ‌కాశం ఉంది. గోండు వీరుడు కొమ‌రం భీమ్‌గా తారక్‌, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌లు న‌టిస్తున్నారు. వీరితోపాటు పాటు సముద్రఖని, అజయ్‌ దేవగణ్‌, ఆలియా భట్‌, ఒలివియా మోరిస్‌ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటిస్తున్నారు. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై డి.వి.వి.దానయ్య ఈ సినిమా నిర్మిస్తున్నారు.

Next Story
Share it