పవన్ కళ్యాణ్ కోసం కాఫీ టైమ్ ట్వీట్స్ చేశా
రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా మరోసారి ఆసక్తికర చర్చకు తెరలేపారు. పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించిన ఆయన వరస పెట్టి ట్వీట్లు చేశారు. పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానాలు కలసి నటించిన బీమ్లానాయక్ సినిమాను పాన్ ఇండియా మూవీగా విడుదల చేసి సత్తా చాటాలని కోరారు. ఇటీవల తాను అల్లు అర్జున్ పై పెట్టిన ట్వీట్లు వోడ్కా టైమ్ లో పెట్టినవి అని...కానీ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి పెట్టినవి కాఫీ టైమ్ లో పెడుతున్నానని..తనలోని సీరియస్ నెస్ ను అర్ధం చేసుకోవాలని కోరారు. వర్మ ట్వీట్లు ఇలా సాగాయి...' ఎప్పుడో మీ తర్వాత వచ్చిన పిల్లలు తారక్, రామ్ చరణ్ లు కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోతూ ఉంటే, మీరు ఇంకా ఒట్టి తెలుగు ని పట్టుకుని వేలాడటం మీ ఫ్యాన్స్ అయిన మాకు కన్నీటి ప్రాయంగా ఉంది.దయచేసి భీమ్లా నాయక్ ని పాన్ ఇండియా తీసుకెళ్ళి మీరే సబ్ కా బాప్ అని ప్రూవ్ చెయ్యండి. ఇంటీరియర్ ఆంధ్ర లో జరిగిన పుష్ప సబ్జెక్ట్ పాన్ ఇండియా సబ్జెక్ట్ అయినప్పుడు, కొమరం భీమ్, అల్లూరి లాంటి తెలుగు వీరుల సబ్జెక్ట్ పాన్ ఇండియా అయినప్పుడు, భీమ్లా నాయక్ సబ్జెక్ట్ పాన్ వరల్డ్ సబ్జెక్ట్ కాదంటారా.
పుష్ప యే అంత చేస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయిన మీరు నటించిన భీమ్లా నాయక్ ఇంకా ఎంత కలెక్ట్ చెయ్యాలి? ..పాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ చెయ్యకపోతే మీ ఫ్యాన్స్ అయిన మేమంతా బన్నీ ఫ్యాన్స్ కి ఆన్సర్ చెయ్యలేము. ఆ రోజు సర్దార్ గబ్బర్ సింగ్ ను హిందీలో రిలీజ్ చెయ్యొద్దు వర్కవుట్ అవ్వదు, అని ఈ ట్విట్టర్ సాక్షిగా ఎంత మొత్తుకున్నా మీరు వినలేదు.. ఫలితం చూసారు...ఇప్పుడు మళ్లీ చెప్తున్నా .. భీమ్లా నాయక్ ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా రిలీజ్ చెయ్యండి..పవర్ ప్రూవ్ చెయ్యండి.' అంటూ వ్యాఖ్యానించారు. మరి వర్మ ఈ ట్వీట్లపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా తెలుగుతోపాటు హిందీలోనూ భారీ ఎత్తున వసూళ్ళు సాధించిన విషయం తెలిసిందే.