Telugu Gateway
Cinema

షాక్ లో సినీ పరిశ్రమ !

షాక్ లో సినీ పరిశ్రమ !
X

గత పద కొండు సంత్సరాలుగా తెలంగాణాలో సినీ పరిశ్రమ ఏది కోరుకుంటే అదే జరిగిపోయింది. అటు కెసిఆర్ సర్కారు కానీ..ఇటు నిన్న మొన్నటి వరకు రేవంత్ రెడ్డి సర్కారు కానీ పరిశ్రమను బాగానే చేసుకున్నాయి. ముఖ్యంగా కెసిఆర్ హయాంలో అయితే అప్పటి మంత్రి కేటీఆర్ తో సినిమా పరిశ్రమకు చెందిన వాళ్ళు ఎంతో సన్నిహితంగా ఉన్నారు అనే ప్రచారం కూడా జరిగింది. ఈ రెండు ప్రభుత్వాలు కూడా ప్రేక్షకుల కోణంలో కాకుండా సినిమా నిర్మాతలు, దర్శకులు..హీరోల కోణంలోనే వాళ్లకు లాభాల వచ్చేలాగానే వ్యవహరిస్తూ వచ్చాయి. అందుకే సినిమా ఎలా ఉన్న కూడా వారం రోజుల్లో మన డబ్బులు మనం సంపాదించుకుని బయటపడాలి అనే దర్శక, నిర్మాతల ప్లాన్ కు ప్రభుత్వాలు సహకరించుకుంటూ వచ్చాయి. సినిమా నిర్మాణ ఖర్చు దగ్గర నుంచి...రెమ్యూనరేషన్ విషయంలో కూడా వాళ్ళు చెప్పే దొంగ లెక్కల సంగతి అందరికి తెలిసిందే. కాకపోతే వీటిని చూపించే..చెప్పే భారీ బడ్జెట్ సినిమా లు అంటూ రేట్లు పెంచుకోవటానికి ఒక అస్త్రంగా వాడుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే తెలంగాలో మాత్రం ఇప్పుడు ఒక్కసారి గా లెక్క మారి పోయింది. అల్లు అర్జున్ అతి తో మొత్తం టాలీవుడ్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో తాను సీఎం సీటు లో ఉన్నత కాలం తెలంగాణ లో బెనిఫిట్ షోస్ , అదనపు రేట్లు ఉండవు అని స్పష్టం చేశారు.

నిజంగా అల్లు అర్జున్ తో సీఎం రేవంత్ రెడ్డి కి ఏదైనా విబేధాలు ఉండి ఉంటే అసలు పుష్ప 2 సినిమాకు గతంలో ఎవరికీ ఇవ్వని స్థాయిలో రేట్ల పెంపుకు అనుమతి ఇచ్చి ఉండే వారు కాదు అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన విషయంలో అల్లు అర్జున్ తీరు వివాదాస్పదం అవుతోంది. పోలీస్ లు కోర్ట్ కు సంపర్పించిన నివేదికలోని సంధ్య థియేటర్ యాజమాన్యం కోరిని అనుమతిని తిరస్కరించినట్లు అధికారికంగా వెల్లడించారు. ఇదే విషయాన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కూడా తెలిపారు. అయితే అల్లు అర్జున్ మాత్రం తనకు పోలీస్ లే దగ్గరుండి రోడ్ క్లియర్ చేశారు అని...అనుమతి లేదు అని చెపితే వెనక్కి వెళ్లిపోయే వాడిని అని చెపుతున్నారు. ఇక్కడ కీలక విషయం ఏమిటి అంటే సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మృతి విషయంలో అల్లు అర్జున్ స్పందించిన తీరు ఏ మాత్రం సరిగా లేదు అనే అభిప్రాయం ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు లో అరెస్ట్ అయి 12 గంటలు అల్లు అర్జున్ జైలు లో ఉండి వచ్చినందుకు పరిశ్రమ మొత్తం తరలివచ్చి ఆయనకు సంఘీభావం గా నిలబడ్డారు అంటే వాళ్ళు అంతా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అనే ప్రభుత్వ నిర్ణయాన్ని పరోక్షంగా తప్పుపట్టినట్లే అనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి.

ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రస్తావించారు కూడా . అయితే ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ఎవరి డబ్బులతో సినీ రకరకాల స్టేటస్ లు అనుభవిస్తున్నారో వాళ్ళ విషయంలో కనీసం మానవత్వం లేకుండా చనిపోయిన వాళ్ళ విషయంలో మాట కూడా మాట్లాడకుండా...ఒక్క అల్లు అర్జున్ కు మాత్రమే సంగీభావం తెలపటం సినీ పరిశ్రమ నైజాన్ని బయటపెట్టింది అనే చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి రేవంత్ రెడ్డి నిర్ణయం తెలంగాణలోని సినీ ప్రియులకు ఊరటగా కలిపించే అంశం అయితే దోపిడీకి అలవాటు పడ్డ పరిశ్రమకు మాత్రం బిగ్ షాక్ అనే చెప్పాలి. శనివారం నాడు అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ పై...సినీ పరిశ్రమపై అల్లు అర్జున్ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి స్పందించటం కూడా ఆయన యాటిట్యూడ్ తెలియచేస్తోంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం తప్పేమి కాదు. కానీ కేసు కోర్టు లో ఉన్నప్పుడు సీఎం చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే...సహజంగా నోట్ విడుదల చేయటం..లేదా సోషల్ మీడియా వేదికగా స్పందించటం చేస్తారు. కానీ అల్లు అర్జున్ మాత్రం అందుకు బిన్నంగా వ్యవహరించారు. తన క్యారెక్టర్ డ్యామేజ్ చేయాలనీ చూస్తున్నారు అని అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో స్పందించారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టికెట్ రేట్లు పెంపు విషయంలో మాటకు ఎంత మేర కట్టుబడి ఉంటారు అన్నది కూడా వేచిచూడాల్సింది. నిజంగా అసెంబ్లీ చెప్పినట్లే అదే మాటకు కట్టుబడి ఉంటే ఈ విషయంలో మాత్రం రియల్ హీరో గా నిలుస్తారు అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

Next Story
Share it