రామ్ 'రెడ్ ' ట్రైలర్ విడుదల
రామ్ ఈ మధ్య ఊరమాస్ పాత్రలకే రైట్ రైట్ చెబుతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తో చేసిన ప్రయోగం ఒకింత వర్కవుట్ అయినట్లే కన్పిస్తోంది. ఇప్పుడు రెడ్ మూవీలో నూ ఓ మాస్ క్యారెక్టర్. మరో క్లాస్ క్యారెక్టర్ చేశాడు. ఈ రెడ్ మూ వీతమిళ 'తడమ్'కు రీమేక్. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నారు.
ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల మందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో గురువారం చిత్రబృందం సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది. 'అసలే నువ్వంటే నాకు మంట.. తప్పు చేశావురా ఈ సారి మంట మాములుగా లేదు', 'వాడికి ఉన్న తెలివి తేటలకి సగం సిటీని తూకం వేసి అమ్మెయగలడు' లాంటి డైలాగ్స్ బాగున్నాయి. ట్రైలర్ చివర్లో నివేదా పేతురాజ్, రామ్ ల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.