Telugu Gateway
Cinema

అదిరిపోయే టైటిల్ తో రామ్ చరణ్ కొత్త సినిమా

అదిరిపోయే టైటిల్ తో రామ్ చరణ్ కొత్త సినిమా
X

మెగా హీరో రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా అయన కొత్త సినిమా టైటిల్ పేరు ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రాంచరణ్ కొత్త సినిమా ఇది. .అదే సమయంలో ఈ సినిమా డైరెక్టర్ శంకర్ కావటంతో దీనిపై అంచనాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. అలాగే టైటిల్ కూడా అదే రేంజ్ లో ఉంది అనే చెప్పాలి. ఆర్ సి 15 సినిమాకు ‘గేమ్ ఛేంజర్’ అనే పేరుపెట్టారు. టైటిల్ టీజర్ కూడా విడుదల చేశారు. ఇందులో శంకర్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. భారీ బడ్జెట్‌తో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అడ్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి ‘సీఈవో’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని ఎక్కువ ప్రచారం జరిగింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఈ పాన్ ఇండియా మూవీకి ‘గేమ్ ఛేంజర్’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. గతంలో కూడా ఒకసారి రామ్ చరణ్ , కియారా అద్వానీ లు జోడి కట్టిన విషయం తెలిసిందే.

Next Story
Share it