రవితేజ కొత్త సినిమా.. 'టైగర్ నాగేశ్వరరావు'
మాస్ మహారాజా రవితేజ తొలిసారి పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. అదే'టైగర్ నాగేశ్వరరావు'. ఈ సినిమా టైటిల్ ను చిత్ర యూనిట్ బుధవారం నాడు విడుదల చేసింది. ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మళయాళ భాషల్లో తెరకెక్కనుంది. ఇది రవితేజ తన 71వ సినిమా. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ మీద తెరకెక్కబోతున్న ఈ సినిమాతో వంశీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 'టైగర్ నాగేశ్వరరావు' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. స్టూవర్టుపురంలో పేరుమోసిన గజదొంగ అయిన 'టైగర్ నాగేశ్వరరావు' బయోపిక్ ఇది.
రవితేజ కెరీర్‌లో అత్యంత భారీగా, పాన్ ఇండియా స్థాయిలో రూపొందబోతుంది. 'ఫీల్ ది సైలెన్స్ బిఫోర్ ది హంట్' అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఆయన నటిస్తున్న సినిమాలు పలు లైన్ లో ఉన్నాయి. 'క్రాక్' విజయం తర్వాత ఏకంగా మూడు సినిమాలు ప్రకటించిన రవితేజ.. వాటిలో రెండు సినిమాలు షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్నారు. అందులో 'రామారావు ఆన్ డ్యూటీ' షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. ఆయన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ధమాకా అనే సినిమా చేయనున్నారు.