రవి తేజ ఎన్నో అంచనాలు పెట్టుకున్న మిస్టర్ బచ్చన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పుడు ఈ మాస్ మహరాజా తన 75 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవి తేజ కు జోడిగా మరోసారి శ్రీ లీల నటిస్తోంది. ఈ సారి దీపావళికి మోత మోగిపోద్ది..మనదే ఇదంతా అంటూ రవి తేజ సిగరెట్ చేతిలో పట్టుకున్న లుక్ తో బుధవారం సాయంత్రం ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరి ఈ ఆర్ టి 75 తో రవి తేజ ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటాడో చూడాలి.