Telugu Gateway
Cinema

రవితేజ 'ఖిలాడి'.ప్లే స్మార్ట్

రవితేజ ఖిలాడి.ప్లే స్మార్ట్
X

రవి తేజ కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ఆ సినిమా పేరుతో పాటు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. అదే 'ఖిలాడి'. ట్యాగ్ లైన్ ప్లే స్మార్ట్ అని పెట్టారు. రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది రవితేజ నటిస్తోన్న 67వ చిత్రమిది. ఈ లుక్‌లో బ్లాక్‌ డ్రెస్‌లో స్టెప్‌ వేస్తున్న రవితేజ, ఆయన చుట్టూ డబ్బులు గాల్లో ఎగురుతున్నాయి. డా.జయంతిలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో రవితేజ డ్యూయెల్‌ రోల్‌ పోషిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్స్‌ గా నటిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు. "ఖిలాడి సినిమా ఫస్ట్‌ లుక్‌. మరో ఎగ్జయిటింగ్‌ జర్నీకి అంతా సిద్ధమైంది" అని రవితేజ అన్నారు.

Next Story
Share it