Telugu Gateway
Cinema

యాక్షన్ మోడ్ లో 'ఖిలాడీ'

యాక్షన్ మోడ్ లో ఖిలాడీ
X

రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా 'ఖిలాడి'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీలోని మిలాన్ లో జరుగుతోంది. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను హీరో రవితేజ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తుండగా..ఆయనకు జోడీగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి సందడి చేయనున్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే రవితేజ, శృతిహాసన్ జంటగా నటించిన సినిమా క్రాక్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

Next Story
Share it