Telugu Gateway
Cinema

రవితేజ 'బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది'

రవితేజ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది
X

రవితేజ కొత్త సినిమా 'ఖిలాడి'. మంగళవారం మాస్ మహారాజా రవితేజ పుట్టిన రోజు కావటంతో చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను విడుదల చేసింది. రవితేజ, శృతిహాసన్ జంటగా నటించిన క్రాక్ సినిమా ఇటీవలే విడుదల అయిన బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు సాధిస్తూ దూసుకెళుతోంది. మరో వైపు ఖిలాడి సినిమా పనుల్లో రవితేజ బిజీగా ఉన్నారు. రమేశ్ వర్మ దర్శకత్వంలో లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

పెన్‌ స్టూడియోస్‌ సమర్పణలో హవీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తొలి గ్లింప్స్ లో చేతులో రాడ్‌ పట్టుకొని తనదైన శైలిలో నడుస్తూ ఫ్యాన్స్ ను కుషీ చేశాడు రవితేజ. ఎలాంటి డైలాగ్స్‌ లేకుండా కేవలం బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో విడుదలైన ఫస్ట్‌ గ్లింప్స్‌ పై రవితేజ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుందని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story
Share it