Telugu Gateway
Cinema

రవి తేజ కెరీర్ లో టాప్ ఫైవ్ సినిమాలు ఇవే!

రవి తేజ కెరీర్ లో టాప్ ఫైవ్ సినిమాలు ఇవే!
X

ధమాకా సినిమా తో రవితేజ దుమ్ము రేపుతున్నాడు. అయన కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఇది చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు 104 కోట్ల రూపాయల గ్రాస్ తో 42 కోట్ల రూపాయల పైగా షేర్ తో ఈ సినిమా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. సంక్రాంతి సినిమాలు విడుదల అయ్యే జనవరి 11 వరకు కూడా ధమాకా సినిమా కు వసూళ్లు ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది. నక్కిన త్రినాధరావు దర్శకత్వం లో తెరకెక్కిన ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీ లీల కూడా ఈ సినిమా లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా పాటల్లో శ్రీలీల డాన్స్ చాలా ఈజ్ తో చేయగా..తన నటనతోనూ ఆకట్టుకుంది.

మొత్తానికి ధమాకా సినిమా ఫుల్ ఎంటర్టైనర్ గా ఉండటం ప్రేక్షకులు ఈ సినిమాను బాగానే ఎంజాయ్ చేశారు. కలెక్షన్ లు కూడా ఈ విషయాన్నీ రుజువు చేస్తున్నాయి. రవి తేజ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ధమాకా నిలవగా..ఆ తర్వాత స్థానంలో క్రాక్, రాజా ది గ్రేట్, బలుపు, పవర్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు పాత సినిమాల రికార్డులను ఈ ధమాకా బ్రేక్ చేసింది. గత ఏడాది క్రిస్మస్ సందర్భంగా ధమాకా సినిమా విడుదల కాగా...ఈ సంక్రాంతి సందడిలోనే రవితేజ భాగస్వామ్యం ఉన్న సినిమా విడుదల కానుంది. వాల్తేర్ వీరయ్య సినిమాలోనూ చిరంజీవితో కలిసి రవితేజ నటించిన విషయం తెలిసిందే.

Next Story
Share it