ఈ సారి పక్కా అంటున్న రవి తేజ

రవి తేజ హీరోగా నటించిన మాస్ జాతర సినిమా కొత్త రిలీజ్ డేట్ వచ్చింది. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 31 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రవి తేజ కు జోడిగా శ్రీ లీల నటించింది. ముందు చెప్పినట్లుగానే నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ దసరా ను పురస్కరించుకుని రిలీజ్ డేట్ పై ఒక వీడియో విడుదల చేసింది. సంక్రాంతి అయిపోయింది...సమ్మర్ అయిపోయింది..చివరకు వినాయక చవితి కూడా అయిపోయింది ఇంకా సినిమా విడుదల ఎప్పుడు అంటూ రవి తేజ ను ఆది అడగటం...ఈ సారి రిలీజ్ మాత్రం పక్కా..వినాయకుడి మీద ఒట్టు అంటూ రవి తేజ ఈ కొత్త రిలీజ్ డేట్ చెప్పారు.
ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన రవి తేజ సినిమా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో రవి తేజ, శ్రీ లీల జంటగా నటించిన ధమాకా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని దక్కించుకుంది. దీంతో ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మాస్ జాతర సినిమా పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. రవి తేజ గత సినిమా లు మిస్టర్ బచ్చన్, ఈగల్ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయియి. దీంతో ఇప్పుడు రవి తేజ కు మాస్ జాతర హిట్ కావటం కూడా ఎంతో కీలకం అనే చెప్పాలి.



