Telugu Gateway
Cinema

మాస్ జాతర ట్రైలర్ డేట్ ఫిక్స్

మాస్ జాతర ట్రైలర్ డేట్ ఫిక్స్
X

రవి తేజ, శ్రీ లీల జంటగా నటిస్తున్న సినిమా మాస్ జాతర. భాను బోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ అక్టోబర్ 31 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకోగా...ఈ మూవీ కి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. అదే సమయంలో ఈ సినిమా ట్రైలర్ ను అక్టోబర్ 27 న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన సంగతి తెలిసిందే.

రవి తేజ, శ్రీ లీల జంటగా నటించిన ధమాకా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం దక్కించుకోవటంతో ఈ సినిమా పై కూడా అంచనాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి. కాకపోతే రవితేజ గత సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా విజయం సాధించలేదు. దీంతో ఈ మాస్ హీరో కూడా మాస్ జాతర సినిమా విజయంపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. మాస్, ఫన్, యాక్షన్ అల్ ఇన్ వన్ మాస్ జాతర అని చిత్ర యూనిట్ చెపుతోంది.

Next Story
Share it