జీ 5 లో స్ట్రీమింగ్

ఈ ఏడాది సంక్రాంతికి విడుదల అయిన సినిమాలు అన్నీ కూడా ఇప్పటికే ఓటిటి లోకి వచ్చేశాయి. ఈ సారి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా ఐదు సినిమాలు పోటీ పడిన విషయం తెలిసిందే. ఇందులో రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కూడా ఉంది. గత రవి తేజ సినిమాలతో పోలిస్తే ఈ సినిమా ఎంతో బాగుటుంది అని చెప్పొచ్చు. అయితే సంక్రాంతి రేస్ లో నిలిచిన ఇతర సినిమాలతో పోలిస్తే ఈ మూవీ ఎంతో వెనుకబడిపోయింది.
దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టుకోలేకపోయింది. దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటి లోకి వస్తోంది. మార్చి 13 నుంచి ఈ సినిమా జీ 5 లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్నిజీ 5 అధికారికంగా వెల్లడించింది. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో రవితేజ కు జోడిగా ఆషికా రంగనాథ్, డింపుల్ హయతిలు నటించారు. బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపించలేకపోయిన ఈ సినిమా ఓటిటి లో ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటుందో చూడాలి.



