రవి తేజ కు పండగ కలిసొస్తుందా!

ఫలితాలతో పని లేకుండా వరసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో రవి తేజ ఒకరు. గత ఏడాది బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చిన రవి తేజ సినిమాలు ఈగల్, మిస్టర్ బచ్చన్ లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాయి. ఇప్పుడు రవి తేజ కు మరో హిట్ అవసరం. దీంతో మాస్ హీరో తన కొత్త సినిమా మాస్ జాతర పై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమాలో రవి తేజ కు జోడిగా శ్రీ లీల నటిస్తోంది. వీళ్ళిద్దరిది హిట్ కాంబినేషన్ కావటంతో మాస్ జాతరపై ఒకింత అంచనాలు ఉన్నాయనే చెప్పాలి. చిత్ర యూనిట్ గురువారం నాడు ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించింది.
ఈసారి పండక్కి సౌండ్ మామూలగుండదు అని..వినాయక చవితి సందర్భంగా ఈ మూవీ ని ఆగస్ట్ 27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. దర్శకుడు బాను భోగవరపు తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈ మే లోనే విడుదల కావాల్సి ఉన్నా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. రవితేజపై ఒక మాస్ పోస్టర్ ని విడుదల చేసి ఈ ఆగస్ట్ 27న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ ఈ చిత్రం విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తోంది.



