Telugu Gateway
Cinema

సంక్రాంత్రి బరిలో మరో సారి రవి తేజ

సంక్రాంత్రి బరిలో మరో సారి రవి తేజ
X

మాస్ మహారాజ రవి తేజ ఈ ఏడాది సంక్రాంతికి మరో హీరో చిరంజీవి తో కలిసి వాల్తేర్ వీరయ్య సినిమాతో ప్రేక్షుకులను అలరించాడు. కానీ వచ్చే ఏడాది మాత్రం సోలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈగల్ సినిమాతో మరో సారి సంక్రాంతి రేస్ లో నిలుస్తున్నాడు. ఈగల్ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ సోమవారం నాడు విడుదల చేసింది. వెలుతురు వెళ్లే ప్రతి చోటుకు ఈగల్ బులెట్ వెళుతుంది వంటి పవర్ ఫుల్ డైలాగులతో టీజర్ వచ్చింది.

అయితే వచ్చే సంక్రాంతికి సినిమాల పోటీ ఒక రేంజ్ లో ఉండబోతుంది. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమా జనవరి 12 న విడుదల అవుతుంటే...రవి తేజ ఈగల్ జనవరి 13 న, సీనియర్ హీరో వెంకటేష్ సినిమా సైంధవ్ కు అదే రోజు విడుదల కానుంది. విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ కూడా సంక్రాంతి రేస్ లోనే ఉంది. తేజ సజ్జ సినిమా హనుమాన్, నాగార్జున సినిమా నాసామిరంగా కూడా ఉన్నాయి.

Next Story
Share it