ఇరుముడి ఫస్ట్ లుక్ వచ్చేసింది

రవి తేజ గత కొంతకాలంగా వరస ప్లాప్స్ తో ఇబ్బందిపడుతున్న విషయం తెలిసిందే. చేసిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతూ వస్తున్నాయి. ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ తీవ్రంగా ఉన్నా కూడా భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో రవితేజకు జోడిగా ఆషికా రంగనాథ్, డింపుల్ హయతిలు నటించారు. వాస్తవానికి ఈ సినిమా రవితేజ గత సినిమాలతో పోలిస్తే ఎంతో మెరుగ్గా ఉన్నా కూడా వసూళ్ల విషయంలో మాత్రం బాగా వెనకపడిపోయింది. దీనికి ప్రధాన కారణం సంక్రాంతి బరిలో నిలిచిన ఇతర సినిమాలతో పోలిస్తే ఈ సినిమా లో ఎంటర్టైన్మెంట్ డోస్ కాస్త తక్కువ ఉండటమే. విడిగా చూస్తే మాత్రం ఈ సినిమా బాగానే ఉంది అని చెప్పాలి. అయితే ఇతర సినిమాల విషయానికి వచ్చేసరికి పోటీని తట్టుకుని నిలబడలేకపోయింది.
ఇప్పటికే రూట్ మార్చిన రవితేజ కొత్త సినిమా ప్రకటన సోమవారం నాడు అంటే జనవరి 26 న వచ్చింది. రవి తేజ పుట్టిన రోజు కావటంతో ఈ సినిమా టైటిల్ ...రవి తేజ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రవితేజ 77 వ సినిమాకు ఇరుముడి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియా భవాని శంకర్ నటిస్తోంది. ఈ ఫస్ట్ లుక్ లో రవితేజ అయ్యప్ప మాల వేసుకుని ఉండటంతో ఇది స్ట్రెయిట్ తెలుగు సినిమానా లేక రీమేకా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం మలయాళంలో తెరకెక్కిన స్వామి అయ్యప్పన్ సినిమా ను డబ్ చేసి తెలుగులో మాలికాపురంగా కూడా విడుదల చేశారు.
రవి తేజ ఫస్ట్ లుక్ చూసిన వెంటనే సినిమా అభిమానులకు ఉన్ని ముకుందన్ నటించిన ఈ సినిమా ని పోలి ఉంది అనే చర్చ ప్రారంభం అయింది. కొంత మంది ఫ్యాన్స్ అయితే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ ను సోషల్ మీడియా వేదికగా ఇదే ప్రశ్న అడిగారు కూడా. ఇది ఇలా ఉంటే హీరో రవితేజ మాత్రం కొన్ని కథలు జీవితంలో సరైన సమయంలో మనల్ని ఎంచుకుంటాయి. అలాంటి ఒక కథే ఈ ఇరుముడి, ఇందులో భాగం కావటం అదృష్టంగా భావిస్తున్నా. కొత్త ప్రయాణంలో ఉత్సహంగా ఉన్నా అని పేర్కొన్నారు. ఈ సినిమాకు జీ వి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నారు.



