రవితేజ'రావణాసుర' షురూ
BY Admin2 Feb 2022 11:04 AM IST
X
Admin2 Feb 2022 11:04 AM IST
రవితేజ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా రావణాసుర. ఈ సినిమా షూటింగ్ బుధవారం నాడు ప్రారంభం అయింది. హీరోయిన్ ఫరియా అబ్దుల్లాతో పాటు దర్శకుడు సుధీర్ వర్మతో సెల్ఫీ దిగిన రవితేజ..తొలి రోజు షూటింగ్ ఎంతో ఉత్సాహంగా ఉందన్నారు. ఈ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. రవితేజతోపాటు ఈ సినిమాలో సుశాంత్ కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లాతోపాటు అను ఇమాన్యుయల్, మేఘా ఆకాష్ కూడా సందడి చేయనున్నారు. ఇది రవితేజ 70వ సినిమా. ఈ ఏడాది సెప్టెంబర్ 30న సినిమాను విడుదల చేసేందుకు నిర్ణయించారు.
Next Story