Telugu Gateway
Cinema

రష్మిక కొత్త సినిమా విడుదలపై అధికారిక ప్రకటన

రష్మిక కొత్త సినిమా విడుదలపై అధికారిక ప్రకటన
X

కంటెంటే కింగ్. టాలీవుడ్ తో పాటు ఇతర పరిశ్రమల్లో కూడా ఈ విషయం ఎన్నో సార్లు ప్రూవ్ అయింది. ఇటీవల విడుదల అయిన సమంత సినిమా మా ఇంటిబంగారం ఏకం గా వంద కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించి సంచలన విజయం నమోదు చేసుకుంది. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ ఉన్న హీరోయిన్స్ రష్మిక ఫుల్ యాక్షన్ మోడ్ తో కూడిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రవీంద్ర పుల్లే దర్శకత్వం లో తెరకెక్కుతున్న మైసా సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ మంగళవారం నాడు అధికారికంగా ప్రకటించింది. దీని ప్రకారం ‘మైసా’ మూవీ నవంబర్ 27 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ విషయాన్ని తెలుపుతూ రష్మిక న్యూ లుక్ ను విడుదల చేశారు. తాజా పోస్టర్‌లో రష్మిక లుక్ చాలా ఇంటెన్స్‌గా ఉంది. చీరకట్టులో, చేతికి విరిగిన సంకెళ్లు.. మరో చేతిలో ఈటె పట్టుకుని యుద్ధభూమిలో ఆమె నిల్చున్న తీరు సినిమాపై అంచనాలను ఒకింత పెంచింది అనే చెప్పాలి. ‘మైసా’ షూటింగ్ సమయంలో రష్మిక తుంటికి గాయం అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గాయం నయం కావడంతో ఆమె తిరిగి సినిమా షూటింగ్స్ లో పాల్గొనటానికి సిద్ధం అవుతున్నారు. మైసా మూవీని అన్ ఫార్ములా ఫిల్మ్స్ పతాకంపై అజయ్ సాయిపురెడ్డి, అనిల్ సాయిపురెడ్డి, వీరసాయి గోప సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ సినిమాలో రష్మిక కనిపించబోతోంది.

Next Story
Share it