Telugu Gateway
Cinema

కొత్త ఫోజులు ట్రై చేస్తున్నాంటున్న ర‌ష్మిక

కొత్త ఫోజులు ట్రై చేస్తున్నాంటున్న ర‌ష్మిక
X

ర‌ష్మిక మంద‌న‌. తాజాగా పుష్ప సినిమాలో డీగ్లామ‌ర్ పాత్ర‌తో దుమ్మురేపింది. ఈ సినిమాలో ఆమె న‌ట‌న‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. శ్రీవ‌ల్లి పాత్ర‌తో త‌న స‌త్తా చాటింది. చిత్తూరు యాస‌లో అల్లు అర్జున్ ను ఆట‌ప‌ట్టించే విష‌యంలో అంద‌రినీ ఆక‌ట్టుకుంది. అల్లు అర్జున్ న‌ట‌న‌తోపాటు ర‌ష్మిక పాత్ర కూడా ఈ సినిమాలో కీల‌కంగా మారింది. ర‌ష్మిక తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఫోటో షేర్ చేస్తూ కొత్త ఫోజుల కోసం ట్రై చేస్తున్నాన‌ని..ఇది ప‌నిచేస్తుందా అంటూ కామెంట్ చేసింది.

Next Story
Share it