Telugu Gateway
Cinema

వెంకీ కుడుమల సెంటిమెంట్ ను దెబ్బకొట్టిన రష్మిక

వెంకీ కుడుమల సెంటిమెంట్ ను దెబ్బకొట్టిన రష్మిక
X

హీరోయిన్ రష్మిక మందన్న నితిన్ కు...దర్శకుడు వెంకీ కుడుములకు షాక్ ఇచ్చారు. దర్శకుడు వెంకీ కుడుమల కొద్ది రోజుల క్రితమే ఒక వీడియో విడుదల చేసి విఎన్ఆర్ ట్రియో పేరుతో సినిమా ప్రకటించారు. ఇది వెంకీ మూడవ సినిమా. అంతకు ముందు అయన చేసిన రెండు సినిమాలు ఛలో, భీష్మలో కూడా హీరోయిన్ రష్మిక మందన్న నే. ఇప్పుడు ముచ్చటగా మూడవ సినిమా లో కూడా ఆమెనే తీసుకున్నారు. అందుకే విఎన్ఆర్ ట్రియో అంటూ ప్రకటించారు. వి అంటే వెంకీ కుడుమల, ఎన్ అంటే నితిన్ ఆర్ అంటే రష్మిక అని చెప్పారు. నితిన్, రష్మిక లు భీష్మ లో కలిసి నటించారు. ఈ సినిమా దర్శకుడు కూడా వెంకీ నే. వీరి జంట ఆ సినిమాలో ప్రేక్షుకులను ఆకట్టుకుంది. దీంతో సెంటిమెంట్ తో మూడవ సినిమా కూడా హీరోయిన్ గా రష్మికనే తీసుకున్నారు. కానీ ఇప్పుడు రష్మిక ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఇది సినిమా పై సెంటిమెంట్ పరంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది అనే చర్చ సాగుతోంది.

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. నితిన్ సినిమా నుంచి రష్మిక తప్పుకోవడానికి ప్రధాన కారణం కాల్షీట్స్ సర్దుబాటు కాకపోవటమే అని చెపుతున్నారు. అయితే ముందు ఈ విషయం తెలియదా ..సినిమా ఎలా అంగీకరించారు...దీని వెనక వేరే కారణాలు ఉంది ఉంటాయనే చర్చ సాగుతోంది. హీరో నితిన్ కంటే దర్శకుడు వెంకీ కి ఒకే హీరోయిన్ సెంటిమెంట్ బ్రేక్ అయినట్లు అవుతుంది అనే చర్చ సాగుతోంది. మరి దీన్ని చిత్ర యూనిట్ ఎలా అధిగమిస్తోందో వేచిచూడాల్సిందే. రష్మిక ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో పాటు రెయిన్ బో, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. రష్మిక హ్యాండ్ ఇవ్వటంతో ఇప్పుడు చిత్ర యూనిట్ ఈ సినిమా కు ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకెళుతున్న శ్రీలీల ను తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. చిత్ర యూనిట్ దీనిపై అధికారికంగా ప్రకటన చేస్తే కానీ ఈ సినిమా హీరోయిన్ ఎవరో తేలదు.

Next Story
Share it