Telugu Gateway
Cinema

బర్త్ డే స్పెషల్

బర్త్ డే స్పెషల్
X

సినిమా టైటిల్స్ క్యాచీగా ఉంటే ప్రేక్షుకులకు ఈజీగా కనెక్ట్ అవుతాయని ఎక్కువ మంది నమ్ముతారు. ఇందులో కొంత వరకు వాస్తవం కూడా ఉంది. కాకపోతే సినిమాలో సరుకు లేకుండా టైటిల్ ఒక్కటే క్యాచీగా ఉంటే ఫలితం ఉండదు. క్యాచీ టైటిల్ అటెన్షన్ తేవటం వరకు ఉపయోగపడుతుంది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇప్పుడు హీరో రామ్ కొత్త సినిమా కు చిత్ర యూనిట్ ఇదే ఫార్ములా ను ఉపయోగించింది. మొన్నటి ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి విజయం సాధించిన తర్వాత పిఠాపురం నియోజకవరంలో పవన్ కళ్యాణ్ ఫాన్స్ అంతా తమ వాహనాలపై పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ రాయిచుకున్నారు.

అప్పటిలో అది పెద్ద ట్రెండింగ్ గా మారింది. అదే లైన్ లో ఇప్పుడు రామ్ కొత్త సినిమాకు ఆంధ్రా కింగ్ తాలూకా అంటూ టైటిల్ అనౌన్స్ చేశారు. దీనికి బయో పిక్ అఫ్ ఫ్యాన్ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. పీ. మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ లో రామ్ పోతినేని జోడిగా భాగ్యశ్రీ భొర్సే నటిస్తోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. హీరో రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో పాటు గ్లింప్స్ కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇదే విషయాన్ని గ్లింప్స్ లో చూపించారు.

Next Story
Share it