Telugu Gateway
Cinema

'రంగ్ దే' ట్రైలర్ విడుదల

రంగ్ దే ట్రైలర్ విడుదల
X

నితిన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సినిమా రంగ్ దే. మార్చి 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ల వేగం పెంచింది. అందులో భాగంగానే శుక్రవారం నాడు రంగ్ దే థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు. 'నేను దేవుడిని ఓ గర్ల్ ఫ్రెండ్ ను ప్రసాదించమని కోరుకున్నారు.

కోరుకున్న ఆరో సెకన్ కే ఓ పాప మా కాలనీకి వచ్చింది. అప్పటి నుంచి తొక్కటం స్టార్ట్ చేసింది నా జీవితాన్ని' అంటూ నితిన్ డైలాగ్ తో స్టార్ట్ అవుతుంది ట్రైలర్. ఆ తర్వాత కీర్తిసురేష్, నితిన్ మధ్య సాగే అల్లరి సీన్లతో ట్రైలర్ సందడి సందడిగా ఉంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.

Next Story
Share it