Telugu Gateway

కరోనా లేకపోతే పెళ్ళి అయిపోయేది

కరోనా లేకపోతే పెళ్ళి అయిపోయేది
X

త్వరలోనే బాలీవుడ్ హీరో రణ బీర్ కపూర్, ప్రముఖ హీరోయిన్ అలియా భట్ ఒక్కటి కాబోతున్నారు. అసలు కరోనా లేకపోయి ఉంటే ఇప్పటికే తమ పెళ్ళి అయిపోయేది ప్రకటించాడు రణబీర్ కపూర్. అలియా భట్ ప్రస్తుతం తెలుగులో ప్రతిష్టాత్మక ఆర్ఆర్ఆర్ మూవీలో చేస్తున్న విషయం తెలిసిందే. ఒక ఇంటర్వ్యూలో రణబీర్‌ తమ పెళ్లి కబురును తాజాగా ధృవీకరించారు.

రణబీర్‌ కపూర్, ఆలియా భట్‌ జంటగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'బ్రహ్మాస్త్ర' అమితాబ్ బచ్చన్, మౌనిరాయ్ ,నాగార్జున, డింపుల్‌ కపాడియా ఇతర కీలక పాత్రలుపోషించారు. బాలీవుడ్‌ హీరోయిన్లు, కత్రినా, దీపికా పడుకొణేతో బ్రేకప్ తరువాత అలియాతో ప్రేమలో పడ్డాడు ర‌ణబీర్. ఇప్పుడు అలియాభట్ ను పెళ్ళి చేసుకోనున్నట్లు స్పష్టం చేశాడు.

Next Story
Share it