రామానాయుడు పరువు తీశారు అంటూ విమర్శలు
ఇది సీనియర్ హీరో వెంకటేష్, మరో హీరో రానాలపై వెల్లువెత్తుతున్న విమర్శలు. దీనికి ప్రధాన కారణం వాళ్ళు ఇద్దరూ కలిసి నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ కావటమే ఇక్కడ చర్చకు కారణం. హీరో వెంకటేష్ తన కెరీర్ లో ఎప్పుడూ ఎక్క్డడ వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం కానీ..వివాదాల్లో చిక్కుకోవటం కానీ జరగలేదు. పూర్తిగా తన పని తాను చేసుకుపోయే రకం. సినిమా ఫంక్షన్స్ లో ఏదో సరదా మాటలు తప్ప ఇప్పటివరకు ఎక్కడా కూడా మాటపడిన దాఖలాలు లేవు. సినీ పరిశ్రమకు సంబంధించి నిత్యం ఏదో ఒక గొడవలు, రాజకీయాలు చాలానే ఉంటాయి. వాటిల్లో కూడా వెంకటేష్ ఎప్పుడూ వేలు పెట్టరు..అసలు అటు వైపు కూడా రారు. కానీ ఒక్క దెబ్బకు వెంకటేష్ ఇమేజ్ దారుణంగా పడిపోయింది అని చెప్పొచ్చు రానా నాయుడు వెబ్ సిరీస్ చూసిన వాళ్ళు..చూడటానికి ట్రై చేసి మిడిల్ డ్రాప్ అయిన వారు అందరు కూడా ఒకటే మాట...తొలి సారి వెబ్ సిరీస్ లో అయినా వెంకటేష్, రానా కలిసి నటిస్తున్నారు అంటే సహజంగా చాలామందికి దీనిపై ఆసక్తి ఉంటుంది. కానీ ఈ వెబ్ సిరీస్ ద్వారా మాత్రం అటు వెంకటేష్, ఇటు రానా లు తమ ఇమేజ్ ను దారుణంగా దెబ్బతీసుకున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.
రానా తండ్రి సురేష్ బాబు పేరు సినీ పరిశ్రమలోని ఆ నలుగురు లో ఒకరిగా పేరు ఉన్నా..రానా మాత్రం సినిమాలపైనే ఫోకస్ పెడుతూ వస్తున్నారు. రామానాయుడు ఉన్న రోజుల్లో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ కే పెద్ద .వేల్యూ ఉండేది. ఇప్పుడు కారణాలు ఏంటో తెలియదు కానీ...ఈ సంస్థ సినిమా నిర్మాణాల విషయంలో మాత్రం గతంలో ఉన్న జోరు చూపించటం లేదు. కానీ అటు వెంకటేష్,, ఇటు రానా లు సినిమాల తో ఫుల్ బిజీగానే ఉన్నారు. అయినా కూడా వీళ్లిద్దరు కలిసి డబ్బుల కోసం ఇలాంటి సిరీస్ లో చేయటం ఏమి అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నారు. అన్ని మీడియా సంస్థలు కూడా ఈ విషయంలో ఇద్దరిపై విమర్శలు చేస్తూనే రివ్యూ లు రాశాయి. రానా నాయుడు వెబ్ సిరీస్ బూతులు మరి దారుణంగా ఉండటం ఒకటైతే...ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లకు ఏ మాత్రం తీసిపోని రీతిలో అడల్ట్ కంటెంట్ ఉండటం చాలా మందిని ఇబ్బందికి గురిచేసింది.