Telugu Gateway
Cinema

'మ‌జ్ను' డైర‌క్ట‌ర్ తో రామ్ చ‌ర‌ణ్‌

మ‌జ్ను డైర‌క్ట‌ర్ తో రామ్ చ‌ర‌ణ్‌
X

కొత్త కాంబినేష‌న్ సెట్ అయింది. నానితో 'మ‌జ్ను' సినిమాను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ తో కొత్త ప్రాజెక్టుకు రెడీ అయ్యారు. యూవీ క్రియేష‌న్స్, ఎన్ వీఆర్ సినిమాలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించ‌నున్నాయి. ఇప్ప‌టికే ఆచార్య‌, ఆర్ఆర్ఆర్ సినిమాల షూటింగ్ పూర్తి చేసుకున్న రామ్ చ‌ర‌ణ్ ఇటీవ‌లే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఇది ప‌ట్టాలపై ఉండ‌గానే మ‌రో ప్రాజెక్టుకు ఓకే చూసి దూకుడు చూపిస్తున్నాడు.

ద‌స‌రా పండ‌గ రోజు ఈ కొత్త సినిమాను ప్ర‌క‌టించాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. చ‌ర‌ణ్ తన ట్విటర్ ద్వారా ఈ విష‌యం వెల్లడిస్తూ.. 'ఈ కాంబినేషన్‌ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నా' అని పేర్కొన్నాడు. అలాగే యూవీ క్రియేషన్స్‌ కూడా తమ అధికారిక ట్విటర్‌ పేజీ ఈ ప్రాజెక్ట్‌పై ప్రకటన ఇచ్చింది. మరోవైపు గౌతమ్‌ సైతం.. చెర్రీతో కలిసి పనిచేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు.

Next Story
Share it