అల్లరి నరేష్ కొత్త మూవీ అమెజాన్ ప్రైమ్ లో

ఒకప్పుడు కామెడీ సినిమాలకే పరిమితం అల్లరి నరేష్ తర్వాత జానర్ మార్చి సీరియస్ సినిమాలు కూడా చేశాడు. వీటిలో కొన్ని విజయం సాధించాయి...మరి కొన్ని సో సో గా నడిచాయి. ఇటీవల మళ్ళీ తనకు కలిసి వచ్చిన కామెడీ జానర్ నే నమ్ముకుని రంభ, ఊర్వశి, మేనక సినిమాతో సెప్టెంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని దక్కించుకోలేక పోయింది. ఇందులో అల్లరి నరేష్ కు జోడీగా సురభి నటిస్తే ...టైటిల్ రోల్స్ రంభ..ఊర్వశి, మేనక పాత్రల్లో రాశి సింగ్, విష్ణు ప్రియా, ప్రిషా సింగ్ లు నటించారు. బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేక పోయిన ఈ సినిమా ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఓటిటి లోకి వచ్చేసింది.



