వసూళ్ల దూకుడు ఎక్కడ ఆగుతుందో !

రామాయణ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. రణబీర్ కపూర్ రాముడిగా...సాయి పల్లవి సీతగా...రావణుడిగా యష్ నటించిన ఈ సినిమాకు విడుదల అయిన దగ్గర నుంచే మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్స్ కూడా అలాగే ఉన్నాయి. నవంబర్ 5 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయల మార్క్ ను దాటి 1035 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. చిత్ర యూనిట్ కూడా వెయ్యి కోట్ల రూపాయల మార్క్ ను దాటిన విషయాన్ని నిర్దారిస్తూ న్యూ లుక్స్ విడుదల చేసింది.



