పవర్ ఫుల్ డైలాగ్స్ తో 'రామారావు ఆన్ డ్యూటీ' టీజర్
రవితేజ కొత్త సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా టీజర్ వచ్చేసింది. శివరాత్రి సందర్భంగా పలు సినిమాల చిత్ర యూనిట్లు ప్రేక్షకులకు కొత్త అప్ డేట్స్ ఇస్తున్నాయి. అందులో భాగంగానే ఈ టీజర్ కూడా విడుదలైంది. 'ఆయుధం మీద ఆధారపడే వాడి ధైర్యం నీలాగా వాడే ఆయుధంలో ఉంటుంది. ఆయుధంలా బతికే నాలాంటోడి ధైర్యం అణువణువునా ఉంటుంది.' అంటూ రవితేజ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ తో టీజర్ కట్ చేశారు.
చాలా రోజుల తర్వాత ఈ సినిమాతో వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీ ఇవ్వన్నారు. ఇందులో రవితేజకు జోడీగా దిశ్వాంత కౌశిక్, రజీషా విజయన్ లు సందడి చేయనున్నారు. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇటీవలే రవితేజ హీరోగా నటించిన ఖిలాడి సినిమా విడుదలైన విషయం తెలిసిందే.