Telugu Gateway
Cinema

రామారావు జూన్ 17న వ‌స్తున్నాడు

రామారావు జూన్ 17న వ‌స్తున్నాడు
X

ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న సినిమా రామారావు ఆన్‌డ్యూటీ. ఇందులో ర‌వితేజ‌కు జోడీగా దివ్యాంశ కౌశిక్‌, రజిషా విజయన్‌లు సంద‌డి చేయ‌నున్నారు. ఈ సినిమాను జూన్‌ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. శరత్‌ మండవ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో రవితేజ డిప్యూటీ కలెక్టర్‌గా కనిపించనున్నాడు. రామారావు ఆన్‌డ్యూటీతో వేణు తొట్టెంపూడి రీఎంట్రీ ఇస్తున్నాడు. నాజర్‌, తనికెళ్ల భరణి, పవిత్రాల ఓకేశ్‌ ముఖ్యపాత్రల్లో నటించారు. సుధాకర్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు.

Next Story
Share it