అదిరిపోయిన ఎన్టీఆర్ కొమరం భీమ్ వీడియో
'వాడు కనపడితే సముద్రాలు తడపడతాయి. నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయి. వాడి పొగరు ఎగిరే జెండా. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ. వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ. నా తమ్ముడు. గోండు బెబ్బులి. కొమరం భీం.' ఇదీ హీరో రామ్ చరణ్ వాయిస్ తో ఆర్ఆర్ఆర్ లో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ వీడియోను చిత్ర యూనిట్ గురువారం నాడు విడుదల చేసింది.ఇది అంతా అడవిలో చిత్రీకరించారు. భీమ్ ఇంట్రో విడుదల చేసిన వీడియోలో డైలాగ్ లకు అనుగుణంగా వచ్చిన దృశ్యాలు..అడవి సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి.
కరోనా కారణంగా నిలిచిపోయిన ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఎన్టీఆర్ పుట్టిన రోజు అయిన మే 20నే సినిమాలో ఆయనకు సంబంధించిన అప్ డేట్ రావాల్సి ఉన్నా లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయింది. రాజమౌలి దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ సినిమాకు డీవీవీ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. మూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో ఇది తెరకెక్కుతోంది. ఈ సినిమాలో తొలిసారి ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలసి నటిస్తున్న విషయం తెలిసిందే.