నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

హీరో రామ్ చాలా కాలంగా హిట్ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. నవంబర్ 27 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాపై ఈ హీరో భారీ ఆశలే పెట్టుకున్నా కూడా ఈ సినిమా మిశ్రమ ఫలితాన్నే అందించింది. ఈ సినిమాకు మొదటి నుంచి మంచి మంచి బజ్ క్రియేట్ అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది . హీరో రామ్ కు ఈ సినిమాలో జంటగా నటించిన భాగ్యశ్రీ బోర్సే తన నటన పరంగా ఆకట్టుకున్నా ఇవేమి సినిమాను నిలబెట్టలేకపోయాయి. ఈ సినిమా ఇప్పుడు ఓటిటి లోకి వస్తోంది. డిసెంబర్ 25 నుంచి ఈ మూవీ ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
తెలుగు తో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఇది అందుబాటులో ఉంటుంది అని అధికారికంగా వెల్లడించారు. పీ. మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 32 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చెపుతున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. తమ అభిమాన హీరో ల కోసం ఫ్యాన్స్ ఎలా చేస్తారు అన్నది ఈ సినిమాలో దర్శకుడు మహేష్ బాబు అద్భుతంగా చూపించారు. క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు ఈ మూవీ లో హైలైట్ గా నిలుస్తాయి. ముఖ్యంగా సినిమా పిచ్చి ఉన్న వాళ్లకు ఇది బాగా నచ్చుతుంది అంతంలో ఏ మాత్రం సందేహం లేదు. నటన పరంగా రామ్ నుడిలో తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.



