Telugu Gateway
Cinema

రజనీకాంత్ సినిమాలో విలన్ రోల్!

రజనీకాంత్ సినిమాలో విలన్ రోల్!
X

రజనీకాంత్ హీరో గా నటిస్తున్న ధర్మన్ సినిమా కు సంబంధించి చిత్ర యూనిట్ వరసపెట్టి ఆసక్తికర అప్డేట్స్ ఇస్తోంది. ఇటీవలే చిత్ర యూనిట్ ఈ సినిమాలో టాలీవుడ్ హీరోయిన్ శ్రీ లీల ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు ప్రకటించింది. దీపావళి రోజు మరో కొత్త అప్ డేట్ ఇచ్చింది. అదేంటి అంటే టాలీవుడ్ హీరో రామ్ పోతినేని కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం అవుతున్నారు అని. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా షేర్ చేశారు. గత కొన్ని రోజులుగా ధర్మన్ సినిమాలో రామ్ నటిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ విషయం అధికారికంగా వెల్లడైంది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే రజనీకాంత్ హీరో గా నటిస్తున్న సినిమాలో రామ్ విలన్ గా కనిపించనున్నారు చెపుతున్నారు.

చిత్ర యూనిట్ విడుదల చేసిన వీడియో లో కూడా రామ్ పోతినేని రఫ్ లుక్ లోనే కనిపిస్తున్నాడు. దీంతో రామ్ కెరీర్ లోనే ఇది ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోనుంది. జైలర్ 2 మూవీ తో సూపర్ డూపర్ హిట్ అందుకున్న రజనీకాంత్ ఇప్పుడు అశ్వత్ మారిముత్తు దర్వకత్వంలో తెరకెక్కుతున్న ధర్మన్ మూవీ లో నటిస్తున్నాడు. ఈ సినిమాను కమల్ హాసన్ కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తోంది. ఇందులో రజనీకాంత్ కు జోడిగా నయనతార నటిస్తుంటే...ఇతర కీలక పాత్రల్లో రాశిఖన్నా, సిమ్రాన్ లు నటిస్తున్నారు. ధర్మన్ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

Next Story
Share it