Telugu Gateway
Cinema

రామ్ సినిమాకు ఊహించని రేటు

రామ్ సినిమాకు ఊహించని రేటు
X

ఆగస్ట్ లో కీలక సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇందులో ఒకటి డబుల్ ఇస్మార్ట్, రెండవది రవి తేజ మిస్టర్ బచ్చన్. వీటితో పాటు ఇప్పటి వరకు అయితే మరో రెండు చిన్న సినిమాలు కూడా రేస్ లో ఉన్నాయి. అప్పటికి ఇవి పోటీ ని చూసి తప్పుకుంటాయా..లేక రేస్ కు రెడీ అవుతాయా అన్నది కొద్ది రోజులు పోతే కానీ తెలియదు. అయితే ఇప్పుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయం ఒకటి బయటకి వచ్చింది. అదేంటి అంటే హీరో రామ్ పోతినేని కెరీర్ లోనే ఈ డబుల్ ఇస్మార్ట్ అతి పెద్ద ఓటిటి డీల్ పూర్తి చేసుకుంది. మంచి బజ్ ఉన్న ఈ సినిమాను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ 33 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఇది స్ట్రీమింగ్ కానుంది. చిత్ర యూనిట్ ప్రచారం, పాటలు ఈ సినిమాపై అంచనాలు భారీ గా పెంచాయి. ఆగస్ట్ 15 న విడుదల కానున్న ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ అరవై కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. డబుల్ ఇస్మార్ట్ లో రామ్ కు జోడిగా కావ్య థాపర్ నటిస్తుంటే..విలన్ గా సంజయ్ దత్ నటించారు. ఆగస్ట్ 15 నే రవి తేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ కూడా విడుదల అవుతోంది.

Next Story
Share it