నార్త్ అమెరికా ప్రీ సేల్స్ దూసుకెళుతున్న పెద్ది

రామ్ చరణ్ సినిమా పెద్ది మూవీ ప్రీ సేల్స్ లోనే దుమ్మురేపటం మొదలు పెట్టింది. పలు మార్లు వాయిదా పడిన ఈ సినిమా ఫైనల్ గా జూన్ 4 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. అమెరికా లో ప్రీమియర్స్ జూన్ 3 నే మొదలు కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీమియర్స్ కు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ కాగా... ఉత్తర అమెరికా లో పెద్ది రికార్డు లు నమోదు చేస్తోంది. పెద్ది మూవీ అత్యంత వేగంగా లక్ష డాలర్ల మేర వసూళ్లు రాబట్టినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. గతంలో విడుదల అయిన ఇతర టాప్ హీరోల సినిమాలతో పోలిస్తే ఎంతో వేగంగా ఈ వసూళ్లు సాధించినట్లు చెపుతున్నారు.



