Telugu Gateway
Cinema

గేమ్ ఛేంజర్ పై భారతీయుడు 2 ఎఫెక్ట్ పడుతుందా?!

గేమ్ ఛేంజర్ పై భారతీయుడు 2 ఎఫెక్ట్ పడుతుందా?!
X

సంచలన దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఫస్ట్ డైరెక్ట్ తెలుగు సినిమా గేమ్ ఛేంజర్. ఈ శుక్రవారం నాడు విడుదల అయిన భారతీయుడు 2 సినిమా కు ప్రేక్షకుల నుంచి ఎక్కువగా ప్రతికూల స్పందనలే వ్యక్తం అయ్యాయి. దీంతో శంకర్ తెరకెక్కించిన ఈ భారతీయుడు 2 ప్రభావం తమ హీరో సినిమా గేమ్ ఛేంజర్ ఏమైనా పడుతుందా అన్న టెన్షన్ లో రామ్ చరణ్ ఫాన్స్ ఉన్నారు. చాలా మంది ఇదే అభిప్రాయాన్ని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. సహజంగా ఒక దర్శకుడి సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంటే...ఆ దర్శకుడి తర్వాత సినిమాలపై కూడా ఎంతో కొంత ఈ ప్రభావం పడుతుంది అనే విషయం తెలిసిందే. ఈ ప్రభావం కొన్నిసార్లు సినిమా బిజినెస్ పై కూడా ఉంటుంది.

ఇదే ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ టెన్షన్ కు కారణం. వాస్తవానికి ఎప్పుడో పూర్తి కావాల్సిన రామ్ చరణ్, శంకర్ సినిమా గేమ్ ఛేంజర్ జాప్యం జరుగుతూ వస్తోంది. అయితే ఇటీవలే రామ్ చరణ్ షూటింగ్ పార్ట్ పూర్తి అయింది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు కు చెందిన నిర్మాణ సంస్థ ఈ మూవీ ని తెరకెక్కిస్తోంది. గేమ్ ఛేంజర్ విడుదల వరకు ఫ్యాన్స్ కు ఈ టెన్షన్ తప్పదు అనే చెప్పొచ్చు. ఈ సమస్య కు కొంత అయిన ఉపశమనం రావాలంటే రాబోయే రోజుల్లో చిత్ర యూనిట్ ఇచ్చే అప్ డేట్స్...టీజర్, ట్రైలర్ లు మాత్రమే గేమ్ ఛేంజర్ పై కాన్ఫిడెన్స్ పెంచగలవు అని చెపుతున్నారు.

Next Story
Share it