'గొర్రెలకాపరి'గా రకుల్ ప్రీత్ సింగ్
BY Admin23 Aug 2021 4:52 AM GMT
X
Admin23 Aug 2021 4:52 AM GMT
పాత్ర డిమాండ్ చేయాలే కానీ..కొంత మంది ఎలాంటి సాహసాలకు అయినా రెడీ అవుతారు. గ్లామరస్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు అలాంటి సాహసమే చేస్తోంది. కొండపాలం సినిమాలో గొర్రెలకాపరిగా కన్పించబోతుంది. ఆమె పాత్ర పేరు కూడా ఓబులమ్మ. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో సంచలనం నమోదు చేసిన వైష్ణవ్ తేజ్ తో కలసి ఆమె ఈ సినిమాలో నటిస్తోంది.
ఇటీవలే ఈ సినిమా టైటిల్ ను..వైష్ణవ్ తేజ్ లుక్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా సోమవారం నాడు రకుల్ లుక్ రివీల్ చేశారు. ఎంతో ధైర్యవంతురాలు అయిన ఒబులమ్మ ప్రేమను, జీవితాన్ని ఎంతో అద్భుతంగా అవగాహన చేసుకుంటుందని చిత్ర యూనిట్ ఈ లుక్ తోపాటు రాసుకొచ్చింది. ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నారు.
Next Story