రకుల్ ప్రీత్ సింగ్ కు కరోనా
BY Admin22 Dec 2020 10:09 AM

X
Admin22 Dec 2020 10:09 AM
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'నేను కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. వెంటనే హోం క్వారంటైన్‌లోకి వెళ్లాను. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. దయచేసి ఇటీవల నన్ను కలిసిన వారంతా కరోనా నిర్ధారణ టెస్టులు చేయించుకోగలరు.
అందరు జాగ్రత్తగా ఉండండి'అంటూ ట్విటర్ వేదికగా రకుల్ విజ్ఞప్తి చేసింది. రకుల్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న సినిమాలో నటిస్తోంది. ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్ కుటుంబంతో కలసి మాల్దీవుల పర్యటనకు వెళ్ళొచ్చిన విషయం తెలిసిందే.
Next Story