రకుల్ సమ్మర్ టిప్స్
BY Admin19 April 2021 6:47 AM

X
Admin19 April 2021 6:47 AM
ఓ వైపు కరోనా టెన్షన్. మరో వైపు సమ్మర్ టెన్షన్. ఎండలు బయట ఠారెత్తిస్తున్నాయి. అందుకే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మండే ఎండలను తట్టుకోవటం ఎలా? అంటూ కొన్ని టిప్స్ అందిస్తోంది. అయితే ఇవి తనకు తన న్యూట్రిషనిస్ట్ చెప్పినవే అని వెల్లడించింది. వేసవి తాపాన్ని తగ్గించేందుకు బార్లీ నీరు ఎంతో ఉపయోగపడుతుందని రకుల్ తెలిపింది.
చేతిలో బార్లీ నీటితో కూడిన గ్లాస్ పట్టుకుని ఫోటోకు పోజిచ్చింది. వేసవి కష్టాల నుంచి ఇది చాలా వరకూ ఉపశమనం కలిగిస్తుందని..దీని పేరు చిన్నదే కానీ..పెద్ద పని చేస్తుందని బార్లీ నీరు విశిష్టతను వెల్లడించింది రకుల్. రకుల్ ఇటీవలే బాలీవుడ్ లో దిల్ హై దీవానా సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
Next Story