Telugu Gateway
Cinema

రకుల్.. బాక్సింగ్

రకుల్.. బాక్సింగ్
X

రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య 'చెక్' సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతోపాటు..సినిమాలో రకుల్ పాత్ర కూడా బలమైనది కాకపోవటంతో ఆమెకూ నిరాశనే మిగిల్చింది ఈ సినిమా. తాను చేసే సినిమాల ఫలితం ఎలా ఉన్నా కూడా రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ఫిట్ నెస్ విషయంలో ఏ మాత్రం రాజీపడదు.

నిత్యం ఫిట్ నెస్ కు సంబంధించి వవ్కవుట్స్ చేస్తూనే ఉంటుంది. అంతే కాదు..ఆ ఫోటోలు..వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. సోమవారం ఉధయమే అలాంటి పనిచేసింది. కిక్ బాక్సింగ్ చేస్తున్న వీడియోను షేర్ చేసుకుంది. దీనికి సంబంధించిన పోటోనే ఇది.

Next Story
Share it