Telugu Gateway
Cinema

ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన ర‌కుల్

ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన ర‌కుల్
X

డ్ర‌గ్స్ కేసుకు సంబంధించిన విచార‌ణ‌లో భాగంగా ప్ర‌ముఖ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ శుక్ర‌వారం నాడు ఎన్ ఫోర్స్ మెంట్ డైర‌క్ట‌రేట్ (ఈడీ) విచార‌ణ‌కు హాజ‌రైంది. వాస్త‌వానికి ఆమెను ఈ నెల 6వ తేదీన రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. అయితే ఆ రోజు తాను రాలేనని..త‌న‌కు మ‌రింత స‌మ‌యం కావాల‌ని కోరారు. దీంతో శుక్ర‌వారం నాడు హాజ‌రు కావాల‌న్నారు. చేతిలో ఓ ఫైల్ తో ఆమె శుక్ర‌వారం ఉద‌య‌మే ఈడీ కార్యాల‌యంలోకి ప్ర‌వేశించారు. ఈడీ జారీ చేసిన నోటీసుల‌కు అనుగుణంగా ఆమె వివ‌రాల‌తో వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

ర‌కుల్ ప్రీత్ సింగ్ తోపాటు ఈడీ అడిగే ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు చెప్పేందుకు వీలుగా త‌న వెంట ఆర్ధిక వ్య‌వ‌హారాల‌ను చూసే వ్య‌క్తిని కూడా తెచ్చుకుంది. మ‌నీలాండ‌రింగ్ కోణంలో ఈ విచార‌ణ సాగే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. అయితే ఇది అంతా డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా, కొనుగోలు కోణంలోనే ప‌రిశీలించ‌వ‌చ్చ‌ని స‌మాచారం. ఇప్ప‌టికే ఈ కేసుకు సంబంధించిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాధ్, ఆ త‌ర్వాత ఛార్మిల విచార‌ణ పూర్తి చేసిన విష‌యం తెలిసిందే.

Next Story
Share it