రకుల్...లవ్ సిగ్నల్

ఒకప్పుడు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ ఆదివారం నాడు కీలక ప్రకటన చేసింది. ఆదివారం తన పుట్టిన రోజు కూడా. తాను బాలీవుడ్ హీరో జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించింది. రకుల్ ప్రీత్ సింగ్ నేడు 31వ వసంతంలోకి అడుగుపెట్టింది. కొంత కాలంగా ఆమె బాలీవుడ్ హీరో జాకీ భగ్నానీతో సీక్రెట్‌గా ప్రేమాయాణం నడిపిన రకుల్ తాజాగా వారి బంధాన్ని అధికారికంగా ప్రకటించింది. దీంతో రకుల్ త్వరలోనే జాకీని పెళ్లి చేసుకోబోతోందని, అందుకే తమ రిలేషన్‌షిప్ ఆఫీషియల్ చేసిందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు జాకీ భగ్నానీ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా రకుల్ బర్త్‌డే విషెస్ చెబుతూ రకుల్‌పై తన ప్రేమను వ్యక్తం చేశాడు. దీంతో వీరికి కృతి సనమ్, టైగర్ ష్రాఫ్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, రాశి ఖన్నా, కాజల్ అగర్వాల్ ఆయుష్మాన్ ఖురానాతో పలువురు సెలబ్రిటీలు అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో అసలు ఈ జాకీ భగ్నానీ ఎవరని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. ఈ మేరకు జాకీ భగ్నానీ బాలీవుడ్ నటుడు, నిర్మాతగా రాణిస్తున్నాడు. అతడు కోల్‌కతాలోని సింధీ ఫ్యామిలిలో జన్మించాడు.