'రకరకాల భార్యలు' ..ఆర్జీవీ కొత్త ప్రాజెక్ట్
పలితాలతో సంబంధం ఉండదు. అది సినిమా అయినా..వెబ్ సిరీస్ అయినా.ఆయన అనుకున్నది చేసుకుంటూ పోతుంటారు. ఆయనే ఆర్జీవీ. ఇప్పుడు ఓ కొత్త ప్రాజెక్టు టేకప్ చేశారు. అదేంటి అంటే రకరకాల భార్యల పేరుతో వెబ్ సిరీస్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన ఓ వీడియో ద్వారా వెల్లడించారు. ఇందులో 30 వెడ్స్ 21' ఫేమ్ చైతన్య కీలక పాత్రలో కన్పించబోతున్నారు. ఈ వెబ్ సిరీస్ గురించి చెబుతూ రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంతో మంది మహాకవులు స్త్రీల స్వరూపాన్ని వివిధ రకాలుగా వర్ణించారు.
కానీ కాలమానంలో ఎన్నో రకాల స్త్రీలు ఉద్భవిస్తారు అనే విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. ఇప్పటి కాలంలో ఉన్న భార్యల గురించి అందరికీ తెలియజేస్తూ 'రకరకాల భార్యలు' వెబ్ సిరీస్ తో ముందుకు రాబోతున్నట్లు తెలిపారు. ఒక్కో సిరీస్ లో ఒక్కో రకం భార్యను చూపిస్తానన్నారు. ఒక మగవాడికి ఎలాంటి భార్య దొరికితే అతని బతుకు ఎలా తయారవుతోందో చూపించడమే ఈ సిరీస్ ముఖ్య ఉద్దేశ్యమని ఆర్జీవీ పేర్కొన్నాడు.