Telugu Gateway
Cinema

రాజ్ త‌రుణ్ కొత్త సినిమా 'అనుభవించు రాజా'

రాజ్ త‌రుణ్ కొత్త సినిమా అనుభవించు రాజా
X

సంక్రాంతి అంటే సంద‌డి. గోదావ‌రి జిల్లాల్లో అయితే ఇది మ‌రింత పీక్ లో ఉంటుంది. కోడిపందాలు..ఆ హంగామా అంతా ఓ రేంజ్ లో సాగుతాయి. ఆ సీన్లు గుర్తొచ్చేలా హీరో రాజ్ త‌రుణ్ చేతివేళ్ళ‌నిండా ఉంగ‌రాలు..బ్రాస్ లెట్లు పెట్టుకుని..కోడి మెడ‌పై అలా నిమురుతూ న‌వ్వుతూ క‌న్పిస్తున్నాడు. అంటే ఇదేదో సంక్రాంతి సినిమాలాగే క‌న్పిస్తోంది. అదే రాజ్ త‌రుణ్ హీరోగా న‌టిస్తున్న 'అనుభవించు రాజా' మూవీ. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ను అక్కినేని నాగార్జున శ‌నివారం నాడు విడుద‌ల చేశారు.

ఈ సినిమాను నిర్మిస్తున్న‌ది కూడా అన్న‌పూర్ణ స్టూడియోస్, శ్రీ వెంక‌టేశ్వ‌రా సినిమాస్ ఎల్ ఎల్ పిలు. ఈ సినిమా శ్రీనివాస్ గవిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది. పెద్ద‌గా హ‌డావుడి లేకుండా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో రాజ్‌ తరుణ్‌కు ఇది మూడో సినిమా కాగా, దర్శకుడుకు శ్రీనివాస్‌తో అతడికి రెండవ చిత్రం కావడం విశేషం.

Next Story
Share it