అసలు షో అంతా వాళ్లదే!

గత నెలలో బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద ఫైటే జరిగింది. ఆగస్ట్ 14 న ఒక వైపు రజినీకాంత కూలీ సినిమా..మరో వైపు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల వార్ 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఢీ కొట్టుకొన్న విషయం తెలిసిందే. అయితే రెండు సినిమాలకు ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆదరణ దక్కలేదు. కాకపోతే ఉన్నంతలో రజనీకాంత్ కూలీ సినిమానే పలు కొత్త రికార్డు లు క్రియేట్ చేయటం తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఐదు వందల కోట్ల రూపాయల పైన గ్రాస్ వసూళ్లను సాధించింది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన కూలీ సినిమాలో రజనీకాంత్ తో పాటు విలన్ గా నాగార్జున నటించిన సంగతి తెలిసిందే.
వీళ్ళతో పాటు ఈ సినిమాలో అత్యంత ప్రభావం చూపించిన పాత్రలు ఏమైనా ఉన్నాయా అంటే అది సౌబిన్ షాహిర్ , రచిత రామ్ లవి అని చెప్పొచ్చు. కూలీ సినిమా ఇప్పుడు ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకుంది . ఈ సినిమా ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 11 నుంచి స్ట్రీమింగ్ కానున్నలు అధికారికంగా వెల్లడించారు. తెలుగు తో పాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకి అనిరుద్ అందించిన సంగీతం కీలకంగా మారింది అనే చెప్పాలి. పూజా హెగ్డే మోనికా స్పెషల్ సాంగ్ కూడా కూలీ సినిమా పై బజ్ క్రియేట్ చేయటంలో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో అమీర్ ఖాన్, ఉపేంద్రలు కూడా అతిధి పాత్రల్లో మెరిశారు.



