Telugu Gateway
Cinema

నిర్మాతగా కమలహాసన్

నిర్మాతగా  కమలహాసన్
X

రజనీకాంత్ కొత్త సినిమా అంటే చాలు అంచనాలు అలా పెరిగిపోతాయి. రజనీకాంత్ హీరోగా నటించే సినిమాను మరో స్టార్ హీరో కమల్ హాసన్ నిర్మిస్తున్నారు అంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు అదే జరుగుతోంది. కమల్ హాసన్ సొంత బ్యానర్ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో రజనీ కాంత్ కొత్త సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా టైటిల్ ను చిత్ర యూనిట్ బుధవారం నాడు అధికారికంగా వెల్లడించింది. ఇది సూపర్ స్టార్ రజనీకాంత్ 173వ సినిమా. ఈ మూవీకి ‘ధర్మన్ – ది డెడ్లీ డాక్టర్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మూవీలో సిమ్రాన్, రాశీఖన్నాలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువ దర్శకుడు అశ్వథ్ మారిముత్తు తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. ఈ మూవీ టైటిల్ రిలీజ్ ఈవెంట్ ను బుధవారం నాడు నిర్వహించారు . ఈ ప్రాజెక్ట్ కోసం నలుగురు దర్శకులు మారారు అని రజనీకాంత్ వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ తాను ఇప్పుడు వేదికగా ఏమి మాట్లాడాలన్నా భయపడుతున్నట్లు తెలిపారు. తాను ఏమి మాట్లాడినా ఇప్పుడు అదో సమస్య అవుతోంది అన్నారు. అది తనతో పాటు ఇతరులకు కూడా ఇబ్బందిగా మారుతోంది అని వ్యాఖ్యానించారు. మనల్ని ఇష్టపడని వారికి మనం ఏమి చేసినా నచ్చదు అనే విషయం తనకు అర్ధం అయింది అన్నారు. ‘డ్రాగన్’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన యువ దర్శకుడు అశ్వథ్ మారిముత్తు ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ లో ఏకంగా ఎనిమిది పాటలు ఉంటాయి అని..ఇవి అన్నీ కూడా విభిన్నంగా ఉంటాయన్నారు దర్శకుడు. సాధారణంగా హీరో రిలాక్స్డ్ గా ఉంటే..నిర్మాత హడావుడిగా ఉంటారు అని ..కానీ ఈ సినిమా విషయంలో రజనీకాంత్ ఎవరిని నిద్రపోనివ్వటం లేదు అంటూ ఈ సినిమాకు నిర్మాత వ్యవహరిస్తున్న కమల హాసన్ సరదాగా వ్యాఖ్యానించారు.

Next Story
Share it